December 3, 2023

Daily takes Two Tablespoons of Chia Seeds helps you to loose weight: అధిక బరువు తగ్గడం కేవలం అందం కోసమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా. అందుకే ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరి అల్టిమేట్ గోల్ ‘బరువు తగ్గడం’. అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ఎక్సర్ సైజులతో పాటు ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. చివరికి ఆశించిన స్థాయిలో బరువు తగ్గక అవస్థలు పడుతుంటారు. అన్ని రకాల ఎక్సర్ సైజులు, ప్రాడక్ట్స్ వాడి విసుగెత్తి.. చివరికి న్యాచురల్‌గా బరువు తగ్గించుకోవడం వైపు మొగ్గుచూపుతారు. అలాంటి వారికి ఎక్కువగా సూచించే ముఖ్యమైన వాటిలో ‘చియా గింజలు’ ఒకటి. 

చియా విత్తనాలు మెక్సికోకు చెందినవి. ఇవి పుదీనా జాతికి చెందినవి. చియా విత్తనాలు తృణ ధాన్యాలు. చూసేందుకు చిన్నగా ఉండి.. నలుపు రంగులో ఉంటాయి. చియా విత్తనాలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఒమేగా–3 ప్యాటీ ఆమ్లాల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విత్తనాలు ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు కాల్షియంలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఈ మొక్కలను ఎలాంటి మందులను వాడకుండా పెంచవచ్చు. ఉత్తరాన 23 డిగ్రీల నుంచి 23 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య పెరుగుతుంది.

ఆరోగ్యానికి చియా విత్తనాలు బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. బరువును త్వరగా తగ్గించే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. తొందరగా బరువును తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి చియా విత్తనాలు ఎంతగానో ఉపకరిస్తాయి. చియా విత్తనాలలో ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్లు అధికం. చియా విత్తనాలు తినడం వల్ల శక్తితో పాటు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు కరిగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతారు. చియా విత్తనాలు మన శరీరంలో ఉన్న లిక్విడ్లతో సంయోగం చెంది తర్వాత అవి మందమైన జెల్ గా మారుతాయి.

బరువు తగ్గాలనుకునేవారు రోజుకి రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను తమ ఆహారంలో తీసుకోవాలి. నీటిలో నేరుగా రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను బాగా కలుపి తాగొచ్చు కూడా. చియా గింజలను పుడ్డింగ్‌లు, స్మూతీ బౌల్స్, జ్యూస్‌లు, వోట్ మీల్‌లలో అంతర్భాగంగా వాడతారు. షేక్‌లు, డెజర్ట్‌లు, పెరుగుతో కూడా చియా గింజలను తీసుకుంటారు. వీటితో పాటు రకరకాల వంటకాలలో కూడా వీటిని ఉపయోగిస్తారు. బరువు తగ్గటానికి కేవలం ఇవి తింటే సరిపోదు. చియా విత్తనాలను తీసుకుంటూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, చక్కటి ఫిట్ నెస్ సొంతమంవుతుంది.

Also Read: Viral Video: కారు ఢీకొట్టడంతో కిందపడిన బైకర్.. లేచిన బైకిస్ట్‌ రియాక్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు! ట్విస్ట్ ఏంటంటే

Also Read: LIC IPO Shares Allotment Status: ఎల్ఐసి ఐపిఓ షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link – https://bit.ly/3hDyh4G

Apple Link – https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *