
5 Kitchen Ingredients for Weight Loss: బరువు పెరగడం ఎంత సులభమో.. తగ్గడం అంత కష్టం. ఆ తగ్గడం కూడా ఒక క్రమ పద్దతిలో జరగకపోతే లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ బారినపడుతారు. చాలామంది బరువు తగ్గేందుకు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వెయిట్ లాస్ ప్రొడక్ట్స్‌ని వాడుతుంటారు.అయితే వాటివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నవారు లేకపోలేదు. అందుకే కృత్రిమ మందుల కన్నా సహజ పద్దతిలో బరువు తగ్గడం అన్నివిధాలా శ్రేయస్కరం. ప్రతీ ఇంటి కిచెన్‌లో అందుబాటులో ఉండే కొన్ని దినుసులు, సుగంధ ద్రవ్యాలు తదితర పదార్థాలతో సులువైన మార్గంలో సహజ పద్దతిలో బరువు తగ్గవచ్చు. ఆ పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల మిరియాలు :
నల్ల మిరియాలల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ కూడా మెండుగా లభిస్తాయి. ఇవి నేచురల్ మెటాబాలిక్ బూస్టర్‌గా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయి.
అల్లం :
అల్లం జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో జీర్ణశక్తి, ఆకలి నియంత్రణ చాలా ముఖ్యమైనవి. తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణమవడం, ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో అల్లాన్ని చేరిస్తే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు ఉంటాయి.
దాల్చిన చెక్క :
దాల్చిన చెక్క ఒక అద్భుతమైన వనమూలిక. ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుంది. పాలు, టీ లేదా పెరుగు వంటి వాటిలో దాల్చిన చెక్కను తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చుకుంటే మంచిది.
పసుపు :
మీ డైలీ డైట్‌కు ఒక చిటికెడ్ పసుపును చేర్చండి. ఇది మీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పసుపులో పుష్కలంగా ఉండే యాంటీయాక్సిడెంట్స్ వెయిట్ లాస్‌కి చాలా దోహదపడుతాయి. పాలు, కూరగాయలు, ఇతరత్రా వాటితో పసుపును కలిపి తీసుకుంటే మంచిది.
జీలకర్ర :
బరువు తగ్గేందుకు దోహదపడే పదార్థాల్లో జీలకర్ర ఒకటి.జీర్ణశక్తిని, జీవక్రియలను ఇది ఉత్తేజపరుస్తుంది. శరీరంలోని కేలరీలను కరిగిస్తుంది. ఒక గ్లాసు మంచినీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రంతా నానబెట్టి… ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగితే మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది కేవలం బరువు తగ్గడానికే కాదు గ్యాస్, ఇతరత్రా సమస్యలకు చెక్ పెడుతుంది.
Also Read: Covid-19 Fourth Wave: దేశంలో కొవిడ్ కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు.. ఫోర్త్ వేవ్ అలర్ట్?
Also Read: Flipkart Offer: ల్యాప్‌టాప్స్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. సగం కన్నా తక్కువ ధరకే ఆసస్ వివోబుక్…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link – https://bit.ly/3hDyh4G
Apple Link – https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
link